- Advertisement -

మత్తు మందు ఇచ్చి..8వ తరగతి విద్యార్థినిపై దారుణం!

- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని దియోరియా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సభ్యసమాజం తలదించుకునేలా ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలికను ఆమెతోటి స్టూడెంట్సే సామూహికంగా అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ హేయమైన నేరం రెండు నెలల తర్వాత బాలిక గర్భవతి అని వైద్య పరీక్షల్లో తేలడంతో బయటపడింది.

గత నవంబర్‌లో ఈ ఘటన జరిగింది. ఓ రోజు పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు గైర్హాజరైన సమయంలో తరగతిలోని కొందరు బాలురు ప్రసాదం అంటూ స్వీట్లు పంచారు. ఆ స్వీట్లలో ఒక లడ్డూను బాధిత బాలికకు ఇచ్చారు. అయితే ఆ లడ్డూలో మత్తుమందులు కలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.

లడ్డూ తిన్న తర్వాత బాలికకు మత్తు మొదలైంది. ఆ పరిస్థితిని గమనించిన నిందితులు ఆమెను ఇంటికి తీసుకెళ్తామని చెప్పి, దారి మళ్లించి వారిలో ఒకరి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనలో ఒక సహ విద్యార్థితో పాటు ఒక యువకుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

బాలిక నోరు విప్పకుండా ఉండేందుకు, ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో విడుదల చేస్తామని నిందితులు బెదిరించారు. తీవ్ర భయానికి గురైన బాలిక ఈ విషయాన్ని రెండు నెలల పాటు ఎవరికీ చెప్పలేకపోయింది. కొన్ని రోజులుగా బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను వైద్య పరీక్షలకు తీసుకెళ్లారు. అల్ట్రాసౌండ్ పరీక్షలో బాలిక రెండు నెలల గర్భవతి అని తేలింది. ఈ నివేదిక చూసి షాక్‌కు గురైన తల్లిదండ్రులకు, అప్పుడే బాలిక తనపై జరిగిన దారుణాన్ని పూర్తిగా వివరించింది.

బాలిక తల్లి ఫిర్యాదు మేరకు జనవరి 31న లార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం ప్రధాన నిందితుడు శుభమ్ సైనీతో పాటు ఒక బాల నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నాం. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నాం అని పోలీసులు వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -