- Advertisement -

భార్య, మామను కొట్టి చంపి..అల్లుడు పరార్!

- Advertisement -

హన్మకొండ జిల్లాలోని కడిపికొండ రాజీవ్ గృహకల్పలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ విభేదాలు చివరకు హత్యలకు దారితీసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసుల సమాచారం ప్రకారం, ప్రవీణ్ అనే వ్యక్తి తన భార్య రాజశ్రీ, మామ రాజశేఖర్‌లపై దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని, అదే వివాదం ఈ ఘోరానికి కారణమైందని అనుమానిస్తున్నారు. ఆగ్రహంతో ఇద్దరినీ కొట్టి చంపిన తర్వాత, నిందితుడు వారి మృతదేహాలపై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో రాజశేఖర్, రాజశ్రీ మృతదేహాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

ఘటన అనంతరం ప్రవీణ్ అక్కడి నుంచి పరారయ్యాడు. అంతేకాకుండా, తన కొడుకు, కూతురిని వెంట తీసుకుని వెళ్లినట్లు సమాచారం రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పిల్లల భద్రతపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ, ప్రవీణ్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -