- Advertisement -

కళ్లల్లో కారం కొట్టి రూ.కోటి కొట్టేశారు!

- Advertisement -

హైదరాబాద్‌లో భారీ హవాలా దోపిడీ ఘటన కలకలం రేపింది. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనలో దుండగులు కళ్లల్లో కారం కొట్టి రూ.కోటి వరకు నగదును దోచుకెళ్లినట్లు సమాచారం.

బహదూర్‌పూర ప్రాంతం నుంచి జీడిమెట్లకు బైక్‌పై హవాలా డబ్బును తీసుకెళ్తున్న అజాముద్దీన్ మరియు కుస్రుఫ్‌పై ఈ దాడి జరిగింది. మార్గమధ్యంలో వారిని అడ్డగించిన గుర్తు తెలియని దుండగులు ముందుగా వారి కళ్లల్లో కారం చల్లి గందరగోళం సృష్టించారు. బాధితులు ఏమీ చేయలేని స్థితిలో ఉండగానే వారి వద్ద ఉన్న భారీ మొత్తంలో నగదును దుండగులు లాక్కొని పరారయ్యారు.

ఈ ఘటన కూకట్‌పల్లి ఏసీపీ కార్యాలయం సమీపంలోనే జరగడం మరింత చర్చనీయాంశంగా మారింది. దుండగులు ముందుగానే బాధితుల కదలికలను గమనించి పథకం ప్రకారం దాడి చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత అజాముద్దీన్ మరియు కుస్రుఫ్ సమీప పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హవాలా డబ్బు వ్యవహారం కావడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -