- Advertisement -

ప్రేమ వివాహాం చేసుకున్న పాపానికి!

- Advertisement -

తిరుపతి జిల్లా పుత్తూరులో చోటుచేసుకున్న హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రేమ వివాహం చేసుకున్న భర్త కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అప్పుల భారంతో కుటుంబం ఇబ్బందులు పడుతుండటంతో పద్మ అనే మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే గ్రామస్తులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

పద్మ రాసిన సూసైడ్ నోట్‌ కన్నీళ్లు తెప్పిస్తోంది. తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరికీ తన జీవితం ఒక గుణపాఠం కావాలని ఆమె ఆ లేఖలో పేర్కొంది. జీవితంలో ఎదురైన బాధలు, నిరాశను వివరించిన పద్మ, చివరగా తన తల్లిదండ్రులు తనను క్షమించాలని భావోద్వేగంగా వేడుకుంది. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన, భర్త నిర్లక్ష్య ధోరణి తనను ఈ నిర్ణయానికి తీసుకువచ్చిందని ఆమె లేఖలో వెల్లడించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -