- Advertisement -

మంచిర్యాలలో విషాదం..భార్య,భర్తలిద్దరూ!

- Advertisement -

తెలంగాణలోని మంచిర్యాలలో విషాదం నెలకొంది. మెట్లపై నుండి జారి పడి భర్త మృతి చెందగా మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని భార్య బలవన్మరణం చెందింది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మమత(30)ను 14 నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు తాండూరు మండలం చంద్రుపల్లికి చెందిన కుంబాల నరేశ్(34),

ఈ నెల 17న నిద్రమత్తులో మెట్లపై ప్రమాదవశాత్తు జారిపడ్డారు నరేష్. తలకు తీవ్ర గాయం కావడంతో కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు. నరేష్‌ను పరీక్షించి శస్త్రచికిత్స చేసినా జీవచ్ఛవంలా ఉంటాడని తెలిపారు డాక్టర్లు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురై అదే రోజు రాత్రి కరీంనగర్ – తీగలగుట్టపల్లి రైల్వేట్రాక్ సమీపంలో ఒంటిపై పెట్రోలు పోసుకొని బలవన్మరణానికి పాల్పడింది మమత.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు నరేష్. ఆరు రోజుల వ్యవధిలో భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -