- Advertisement -

ఏపీలో అకాల వర్షాలు..1,215 హెక్టార్లలో పంట నష్టం

- Advertisement -

రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 1,215 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఆరు జిల్లాల్లోని 16 మండలాలు ఈ ప్రభావానికి గురయ్యాయి.

ఇక మరో 267 హెక్టార్లలో ఉన్న ఉద్యాన పంటలు కూడా వర్షాల కారణంగా నష్టపోయాయి. కూరగాయలు, పండ్ల తోటలు, పూల సాగు వంటి పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల తీవ్రత, గాలివానల కారణంగా పంటలు నేలమట్టం కావడం, నీటిమునిగిపోవడం వంటి సమస్యలు చోటుచేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా పంట నష్టం వివరాలను తెలుసుకుని, రైతులకు తక్షణ సహాయం అందించే మార్గాలపై చర్చించారు.

ప్రాథమిక అంచనాలు మాత్రమే కాకుండా పూర్తి స్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతి రైతుకు జరిగిన నష్టం ఖచ్చితంగా లెక్కించి, తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -