Tuesday, May 14, 2024
- Advertisement -

7 విడతల్లో లోక్‌స‌భ ఎన్నికలు?

- Advertisement -

సార్వత్రిక ఎన్నికల నగరాకు టైం సిద్దమైంది. ఈ నెల 15న ఎన్నికల నోటిఫికేషన్ జరిగే అవకాశం ఉండగా 7 విడతల్లో దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. లోక్‌స‌భతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం కసరత్తు చివరి దశకు చేరిన నేపథ్యంలో పోలింగ్ తేదీలపై ఉత్కంఠ నెలకొంది.

దేశంలో 96.88 కోట్ల పైచిలుకు ఓటర్లు ఉన్నారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. కొత్తగా 1.85 కోట్ల మంది ఓటు హక్కు నమోదు చేసుకున్నారని… దేశవ్యాప్తంగా 2100 ఎన్నికల పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. వీరిలో 900 మంది జనరల్ అబ్జర్వర్లు, 450 మంది పోలీస్ అబ్జర్వర్లు, 800 మంది వ్యయ పరిశీలకులు ఉన్నారని తెలిపారు రాజీవ్.

చ్ఛగా, నిష్పక్షపాతంగా, బెదిరింపులు, ప్రలోభాలు లేని ఎన్నికలు జరిగేలా చూడాలని…పరిశీలకులు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ నిష్పక్ష పాతంగా వ్యవహరించాలిఎన్నికల విధుల్లో కఠినంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని..తమకు కేటాయించిన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధికే పరిమితం కావాలన్నారు. పరిశీలకుల వాహనంలో జీపీఎస్ ట్రాకింగ్‌ను అమర్చాలని.. అభ్యర్థులు/రాజకీయ పార్టీలు/సాధారణ ప్రజానీకం/ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి అందుబాటులో ఉండాలన్నారు. పోలింగ్ స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -