Tuesday, April 30, 2024
- Advertisement -

సార్వత్రిక ఎన్నికలు..షెడ్యూల్ కంటే ముందుగానే!

- Advertisement -

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో కమలనాథులు సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోవడంతో లోక్ సభ ఎన్నికలపై దృష్టిసారించారు బీజేపీ నేతలు. అయితే తాజాగా పొలిటికల్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు కమలనాథులు సిద్ధం అవుతున్నారు.

వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్‌ 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే షెడ్యూల్ కంటే కనీసం ఒక నెల ముందుగానే సాధారణ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. ఎన్నికల సంఘం కూడా అదే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఒకవేళ బీజేపీ ముందస్తుకు వెళ్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఏపీలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. అన్ని పార్టీల నేతలు ఎన్నికల మోడ్‌లోకి వెళ్లిపోగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కూడా ప్రారంభించారు. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ మెజార్టీ ఎంపీ స్థానాలను దక్కించేకునేలా ప్రణాళిక రచిస్తోంది. మొత్తంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లోక్ సభ ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరుగగా రాజకీయ పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -