- Advertisement -

‘మహానాడు’ రంగుల డ్రామా!

- Advertisement -

తెలుగుదేశం పార్టీ (TDP) ప్రతి ఏటా నిర్వహించే ‘మహానాడు’ కార్యక్రమంపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నటి శ్యామల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ మహానాడు అనేది ప్రజా సమస్యలను చర్చించే వేదిక కాదని అది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ఆ పార్టీ ఆడుతున్న ఒక రంగుల డ్రామా అని ఆమె అభివర్ణించారు.

మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చెప్తున్న మాటలపై శ్యామల మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గాలికి వదిలేసి, మహానాడులో మాత్రం అబద్ధపు ప్రగల్భాలు పలుకుతూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు.

మహానాడు వేదికగా మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని శ్యామల స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో మహిళలపై దాడులు, అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన ‘దిశ’ వంటి విప్లవాత్మక చట్టాలను పక్కనబెట్టి..ఇప్పుడు మహిళా భద్రతను పూర్తిగా గాలికి వదిలేశారని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో పాలనాపరమైన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మరియు ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇలాంటి ఆర్భాటపు సభలను నిర్వహిస్తున్నారని శ్యామల విమర్శించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నాయని.. చంద్రబాబు నాయుడు ఎన్ని డ్రామాలు ఆడినా ఎంతటి మాటల గారడీ చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేరని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -