- Advertisement -

డబ్బులుంటే మీ ఇష్టమా?

- Advertisement -

డబ్బులుంటే మీ ఇష్టమా అంటూ ఉండి ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై మండిపడ్డారు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు.పశ్చిమ గోదావరి జిల్లాలో మోషేన్ రాజు మీడియాతో మాట్లాడిన ఆయన.. భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణానికి స్థలం లేదని రఘురామకృష్ణంరాజుకు ఎవరు చెప్పారో సమాధానం చెప్పాలి? అని ప్రశ్నించారు.

ప్రజలను మోసం చేయడం సరికాదని..ఉండిలో కలెక్టరేట్ నిర్మాణానికి ముందుకు వస్తున్న దాతలు అందరూ కూడా భీమవరంలోనే నివాసం ఉంటున్నారు. రఘురామ కృష్ణంరాజుకు చిత్తశుద్ధి ఉంటే భీమవరంలో నిర్మించే కలెక్టరేట్ నిర్మాణానికి దాతలు సహకారం అందించండి అని సూచించారు.

గత ప్రభుత్వంలో విడుదల చేసిన 124 జీవో ఇంకా అమలులోనే ఉంది… పెద అమిరం పంచాయతీని భీమవరంలో ఎందుకు కలుపుతారు? రఘురామ కృష్ణంరాజు తన వద్ద భూమి ఉందని చెబుతున్న మూడు ఎకరాల భూమి ఇరిగేషన్ పోరంబోకుది అని దుయ్యబట్టారు. భీమవరం కలెక్టరేట్‌కు, రఘురామకృష్ణ రాజుకు సంబంధం ఏమిటి? డబ్బులుంటే భీమవరం నుంచి మున్సిపాలిటీని, ఎమ్మార్వో ఆఫీస్‌ను ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఉండి తరలించుకుని పోతారా? చెప్పాలన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -