- Advertisement -

బండి దెబ్బకు బీజేపీ ఖేల్ ఖతం?

- Advertisement -

తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ పరిణామం పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా, నాయకులను ఆత్మరక్షణలో పడేసింది. ఈ ఉదంతం కేవలం ఒక వ్యక్తిగత సమస్యగా కాకుండా, పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేసే స్థాయికి చేరుకుంది.

భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు కావడంతో, మీడియాను ఎదుర్కోవడానికి బీజేపీ నేతలు వెనుకాడుతున్నారు. గతంలో ప్రతి చిన్న అంశంపై ప్రెస్ మీట్లు పెట్టే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పుడు మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతున్నారు. జర్నలిస్టులు ఫోన్ చేసి ఈ కేసు గురించి ప్రశ్నిస్తుంటే, సమాధానం చెప్పలేక ఫోన్లు కట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ కేసు వల్ల ఎదురయ్యే ఇబ్బందికర ప్రశ్నల నుండి తప్పించుకోవడానికి పలువురు కీలక నేతలు అండర్ గ్రౌండ్‌కు వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ప్రధాని మోదీ బహిరంగ సభ నిర్వహించి పార్టీలో ఉత్సాహం నింపాలని చూస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం భగీరథ్ కేసుపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ప్రధాని పర్యటన కంటే ఈ వివాదమే పార్టీ ఇమేజ్‌ను ఎక్కువగా డ్యామేజ్ చేసిందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ కేసును డీల్ చేయడంలో బండి సంజయ్ వైఫల్యం చెందారని పార్టీలోని ఒక వర్గం గట్టిగా నమ్ముతోంది.కుమారుడి వ్యవహారాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల మొత్తం పార్టీకి చెడ్డపేరు వస్తోందని పలువురు నేతలు పెదవి విరుస్తున్నారు.భగీరథ్ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి బీజేపీని ఇరకాటంలో పెట్టారని, ఇది ఒక రకంగా కాంగ్రెస్‌కు లాభం చేకూర్చేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ కేసు మా చావుకొచ్చింది అంటూ కొందరు బీజేపీ నేతలు ఆఫ్ ది రికార్డ్‌లో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తుండటం పార్టీలోని అంతర్గత కలహాలకు అద్దం పడుతోంది.
గ్రూపు రాజకీయాలతో ఇప్పటికే సతమతమవుతున్న తెలంగాణ బీజేపీకి, ఈ పోక్సో కేసు అదనపు భారంగా మారింది. రానున్న రోజుల్లో ఈ వివాదం మరెన్ని మలుపులు తిరుగుతుందో, పార్టీ అధిష్టానం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -