- Advertisement -

మంత్రి కొండపల్లిపై చంద్రబాబు సీరియస్

- Advertisement -

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ తండ్రి జోక్యంపై సీఎం తీవ్రంగా మండిపడ్డట్లు సమాచారం. రాజకీయాలకు తన తండ్రిని దూరంగా పెట్టాలని హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఆరు నెలలుగా ఏ వ్యవహారంలోనూ తన తండ్రి జోక్యం చేసుకోవడం లేదని ఈ సందర్భంగా శ్రీనివాస్ చెప్పగా … తన వద్ద నివేదికలు ఉన్నాయని తెలిపారు చంద్రబాబు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రిని చేశానని గుర్తుచేశారు.

ఇదే క్రమంలో పనితీరు మార్చుకోవాలని మంత్రిని మందలించారు. జిల్లాలో వ్యక్తిగతంగా పార్టీ పరంగా ప్రగతి చూపాలని ..అందరిని కలుపుకొని ముందుకెళ్లాలని సీఎం వార్నింగ్ ఇవ్వగా ఇది తెలుగు తమ్ముళ్లలో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -