- Advertisement -
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆషాఢ బోనాల సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. ఇక బోనాల సందర్భంగా మహంకాళి ఆలయానికి ఉదయం నుండే భక్తులు పోటెత్తారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రాక ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ అధికారులు, పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.
బోనాల సందడితో సికింద్రాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. మట్టి కుండలో వండిన బియ్యం, బెల్లం కలిపిన బోనం ను సమర్పించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
