Monday, May 13, 2024
- Advertisement -

తెలంగాణ బీజేపీ..విజయశాంతి ఔట్!

- Advertisement -

తెలంగాణ బీజేపీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలతో చంకలు గుద్దుకున్న బీజేపీ నేతలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. దీంతో అధిష్టానం ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటుంది. .

ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఊహించని రీతిలో బీజేపీకి హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్‌లో చేరగా మాజీ ఎంపీ వివేక్ సైతం సొంతగూటికి చేరిపోయారు. ఇక ఇదే బాటలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సైతం ఉన్నట్లు సమాచారం.

తాజాగా పోరాటాల కమిటీ చైర్మెన్ గా ఉన్న విజయశాంతి ప్రస్తుతం సొంత పార్టీపైనే పోరాటం చేస్తోంది. దీంతో బీజేపీ పరిస్థితి రోజు రోజుకు మరింత దిగజారుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఆమెకు చోటు దక్కలేదు. అసలే బలహీనంగా ఉన్న కాషాయ పార్టీకి సొంత పార్టీ నేతలు వెన్నుపోటు పొడుస్తూ షాక్ లు ఇస్తుండడంతో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక విజయశాంతి బీజేపీని వీడుతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమెకు స్టార్ క్యాంపెయినర్ జాబితాలో పార్టీ అధిష్టానం చోటు కల్పించలేదని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -