- Advertisement -

గన్నవరం పోర్టుపై ”మొంథా” ఎఫెక్ట్

- Advertisement -

గన్నవరం ఎయిర్ పోర్టుపై ”మొంథా” ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చైన్నై, తిరుపతి, హైదరాబాద్, కడప, విశాఖ నుంచి రోజూ 21 విమానాల రాకపోకలు జరుగుతున్నాయి.

అయితే తుఫాన్ ప్రభావంతో మొత్తం 16 విమాన సర్వీసులు రద్దు చేయగా 9 సర్వీసులు రద్దు చేసింది ఇండిగో. షార్జా, బెంగుళూరు,హైదరాబాద్, విశాఖ సర్వీసులను రద్దు చేసింది ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ (4 సర్వీసులు).

ఢిల్లీ, ముంబై సర్వీసులను రద్దు చేసింది ఎయిర్ ఇండియా (3 సర్వీసులు). తుఫాన్ నేపధ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అన్నారు ఎయిర్ పోర్టు డైరెక్టర్, లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు.

అలాగే కాకినాడకు గ్రేట్‌ డేంజర్‌ సిగ్నల్‌ జారీ చేశారు. కాకినాడ పోర్టులో 10వ నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో డేంజర్‌ సిగ్నల్‌ 9 జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవులకు 8వ నెంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -