- Advertisement -

టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ పాజిటివ్

- Advertisement -

హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక వివరాలను ఈగల్ (EAGLE) ప్రత్యేక దళం వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి గిరిధర్ మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలను వివరించారు. డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఎస్పీ వెల్లడించారు. మొదట నిన్న నిర్వహించిన యూరిన్ టెస్ట్‌లో పుట్టా మహేష్‌కు నెగిటివ్ రిపోర్ట్ వచ్చినప్పటికీ, ఈరోజు తీసుకున్న బ్లడ్ శాంపిల్ పరీక్షలో ఆయనకు డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు.

ఈ ఘటనలో మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ వినియోగంతో పాటు పోలీసులపై జరిగిన కాల్పుల ఘటనపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. దాడి సమయంలో అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు పోలీసులను భయపెట్టేందుకు గన్ ఫైరింగ్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు.

ఈ కేసును Telangana Police పలు చట్టాల కింద నమోదు చేసింది. క్రైం నంబర్ 150/2026గా నమోదు చేసిన ఈ కేసులో NDPS చట్టంలోని సెక్షన్ 8(c), 22(A), 27, 29తో పాటు ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 25(1B)(a), 30 మరియు టీఎస్‌ఈఏ చట్టంలోని 34(a) సెక్షన్‌లు నమోదు చేశారు. అలాగే Bharatiya Nyaya Sanhitaలోని సెక్షన్ 109, 131 r/w 3(5) కింద కూడా కేసు నమోదు చేశారు.

డ్రగ్స్ టెస్టులో పైలెట్ రోహిత్ రెడ్డి, పుట్టా మహేష్ కుమార్, రితీష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, నితేష్ శర్మలకు పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నిందితులు కొకైన్‌తో పాటు MDMA వంటి మత్తు పదార్థాలను సేవించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు.

ఈ ఘటన రాజకీయంగా కూడా చర్చనీయాంశమవుతోంది. కేసులో ఉన్న వారందరినీ విచారిస్తూ డ్రగ్స్ సరఫరా మూలాలు, పార్టీ నిర్వహణ వెనుక ఉన్న వ్యక్తులపై పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -