Saturday, May 4, 2024
- Advertisement -

బీజేపీ పూర్తిగా తప్పుకున్నట్లేనా?

- Advertisement -

తెలంగాణ ఎన్నికల రంగంలో నుండి బీజేపీ పూర్తిగా తప్పుకున్నట్లేనా…?ఒకప్పుడు అధికారం మాదే అని ఉదరగొట్టిన బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకిలా సైలెంట్ అయిపోయారు..?అసలు బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు..?మేనిఫెస్టోలో ఏం ప్రకటిస్తారు?కాంగ్రెస్,బీఆర్ఎస్‌లను మించి మేనిఫెస్టో ఉంటుందా? ఇప్పుడు ఇదే బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్న ప్రశ్న.

ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ దూసుకుపోతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ 6 గ్యారెంటీ స్కీమ్‌లతో పాటు 55 స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించగా బీఆర్ఎస్ సైతం హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. 119 స్ధానాలకు అభ్యర్థుల ప్రకటన,బీ ఫామ్ కూడా అందజేసింది. ఇక ఈ రెండు పార్టీల మేనిఫెస్టోలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ..కాంగ్రెస్‌ కంటే మెరుగ్గా ఉందనే టాక్ నడుస్తోంది.

ఇక మొదటి నుండి ఎన్నికల రేసులో బీజేపీ వెనకబడే ఉంది. అగ్రనేతలు తెలంగాణకు వస్తున్న రాష్ట్ర బీజేపీలో మాత్రం ఏ మాత్రం జోష్ రావడం లేదు. ఇంకా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తోండగా త్వరలోనే తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. మేనిఫెస్టోపై ఇంకా కసరత్తు జరుగుతునే ఉంది. కాంగ్రెస్ – బీఆర్ఎస్‌లను మించి మేనిఫెస్టో ఉండాలంటే అన్ని ఉచితంగానే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానంగా పించన్లు, రైతు బంధు, గ్యాస్ సిలిండర్ రేట్.. ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్ వరాల జల్లు కురిపించగా బీజేపీ ఏం చేస్తుందోనని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ రెండు పార్టీలను తలదన్నేలా బీజేపీ మేనిఫెస్టో రూపొందించాలంటే అది సాధ్యమయ్యే పనేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఎందుకంటే ఉచిత పథకాలకు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మరి ఏ అజెండాతో ముందుకొస్తారో తెలియాల్సి ఉండగా బీజేపీ నేతలకు మాత్రం సవాల్‌గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -