Saturday, May 4, 2024
- Advertisement -

కేసీఆర్‌పై పోటీకే డిమాండ్ ఎక్కువ!

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 13 వరకు ఉపసంహరణకు అవకాశం ఉండగా పోటీలో ఉండే వారు ఎంతమంది అనేది 15వ తేదీన తెలియనుంది. ఇక నామినేషన్ల ప్రక్రియను ఓ సారి పరిశీలిస్తే సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న రెండు స్థానాలు గజ్వేల్, కామారెడ్డిలో డిమాండ్ ఎక్కువగా ఉంది. అత్యధికంగా ఈ రెండు స్థానాల నుండే నామినేషన్లు దాఖలు కావడం విశేషం.

గజ్వేల్ లో 154 ,కామారెడ్డిలో 102 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిల్లో కుల సంఘాలు, రైతు సంఘాలు, బాధిత సంఘాలు దాఖలు చేసిన నామినేషన్లే ఎక్కువగా ఉన్నాయి. కొంతమది నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల వారు సైతం ఉన్నారు.

వాస్తవానికి గత ఎన్నికల్లో గజ్వేల్ నుండి కేసీఆర్ పోటీ చేసినప్పుడు 13 మంది మాత్రమే బరిలో ఉండగా ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇక బీజేపీ నుండి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. అలాగే కామారెడ్డిలో కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. మొత్తంగా ఓ వైపు కాంగ్రెస్ గాలి వీస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా లేదా అన్న సందేహం అందరిలో నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -