- Advertisement -

రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్

- Advertisement -

రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ రీఫండ్, రద్దు విధానాల్లో కీలక మార్పులు చేసింది. టికెట్ బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ఈ కొత్త నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపింది.

ఇకపై ప్రయాణానికి 8 గంటల లోపు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ ఇవ్వరు. అలాగే రద్దు సమయాన్ని బట్టి రీఫండ్ శాతం కూడా మారుస్తూ కొత్త విధానం అమల్లోకి తీసుకొచ్చారు.

కొత్త టికెట్ రద్దు నిబంధనలు..

72 గంటల కంటే ముందు రద్దు చేస్తే:
కనిష్ట క్యాన్సిలేషన్ ఛార్జ్ మినహా మిగతా మొత్తం రీఫండ్
72 గంటల నుంచి 24 గంటల మధ్య రద్దు చేస్తే:
టికెట్ ధరలో 25% కోత
24 గంటల నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే:
50% కోత
8 గంటల లోపు రద్దు చేస్తే:
ఎలాంటి రీఫండ్ లేదు
ఎక్కడి నుంచైనా టికెట్ రద్దు అవకాశం

ప్రయాణికులకు సౌలభ్యం కోసం మరో కీలక మార్పు చేసింది రైల్వే శాఖ.

ఇకపై టికెట్ ఎక్కడ బుక్ చేసినా, ఏ రైల్వే స్టేషన్ నుంచైనా రద్దు చేసుకోవచ్చు
టికెట్‌లో ఉన్న స్టేషన్ కాకుండా తరువాతి స్టేషన్ నుంచి కూడా ప్రయాణం ప్రారంభించవచ్చు
మొబైల్ యాప్ ద్వారా బోర్డింగ్ పాయింట్ మార్చుకునే సదుపాయం
అలాగే కోచ్ అప్‌గ్రేడ్ సౌకర్యం

ప్రయాణానికి ముందు ప్రయాణికులకు కొత్త ఆప్షన్:

ట్రైన్ బయలుదేరే 30 నిమిషాల ముందువరకు కోచ్ అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం
ఉదాహరణకు: 3AC నుంచి 1ACకి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు (సీట్లు ఉంటే)
ఈ సదుపాయం అధికారిక మొబైల్ యాప్ ద్వారా లభ్యం

ఈ మార్పులతో ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించడమే కాకుండా, టికెట్ దుర్వినియోగాన్ని తగ్గించడం లక్ష్యంగా భారతీయ రైల్వే ఈ నిర్ణయాలు తీసుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -