Saturday, April 27, 2024
- Advertisement -

షర్మిల..చంద్రబాబు వదిలిన బాణమే!

- Advertisement -

వైఎస్ షర్మిల పైన సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంది టీడీపీ శ్రేణులే. షర్మిల పైన సోషల్ మీడియా పోస్టింగ్స్ వెనుక ఉన్నదెవరు పోలీసులు గుట్టు రట్టు చేశారు. షర్మిల పైన వైసీపీ శ్రేణులే అసభ్యంగా పోస్టింగ్స్ పెడుతున్నారంటూ టీడీపీ సపోర్టింగ్ మీడియా అసత్య ప్రచారం చేస్తోంది. కానీ, వైసీపీ సానుభూతి పరుల పేరుతో టీడీపీ శ్రేణులే ఈ విధమైన పోస్టింగ్స్ చేయటం.. వాటిని వైసీపీ మద్దతు దారులే చేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ప్రచారం చేయటం పరిపాటిగా మారింది. అసలు ఏం జరుగుతుందో తెలిసి కూడా షర్మిల, సునీత మాత్రం నోరు విప్పటం లేదు. చంద్రబాబు డైరెక్షన్ లో పని చేస్తున్న ఈ ఇద్దరు వాస్తవాలను దాచి పెడుతున్నారు.

పులివెందుల ప్రాంతానికి చెందిన వర్రా రవీంద్రారెడ్డి అనే వైసీపీ సానుభూతి పరుడి పేరుతో షర్మిల, సునీత పైన పోస్టింగ్స్ సోషల్ మీడియాలో కనిపించాయి. దీంతో, వెంటనే రవీంద్రారెడ్డి స్థానిక పోలీసులకు తన ఖాతా పేరుతో షర్మిల, సునీత పైన కామెంట్స్ పెడుతున్నారని..వీటితో తనకు సంబంధం లేదని ఫిర్యాదు చేసారు. వీటి పైన పోలీసులు విచారణ చేసారు. అక్కడ అసలు విషయం బయటకు వచ్చింది. విశాఖలో తండ్రి, కుమారులను ఈ విషయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీకి చెందిన కార్తీక్ రెడ్డి ఖాతా నుంచి ఈ ఇద్దరి మీద పోస్టులు చేసినట్లు గుర్తించారు. వీరు ఐటీడీపీ అధ్యక్షుడు చింతకాయల విజయ్ అధ్వర్యంలో పని చేస్తున్నారు అని విచారణ లో తేలింది. దీంతో, ఇప్పుడు విజయ్ కు కూడా నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్దమైనట్లు తెలుస్తోంది.

అదే విధంగా ఇలాంటి పోస్టింగ్స్ కనిపిస్తున్న వైసిపి మొగుడు అనే అకౌంట్ కూడా టీడీపీ మద్దతు దారుడు కొంగ మంజునాధ ఖాతాగా గుర్తించారు. ఈ వ్యక్తి కూడా ఐటీడీపీ ఆధ్వర్యంలోనే తన ఖాతా నిర్వహిస్తున్నాడు. ఈ వ్యక్తిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇక, షర్మిలను వైసీపీ శ్రేణులు దూషిస్తున్నారని చెబుతున్న ఆంధ్రజ్యోతి కేవలం జగన్ పార్టీని డామేజ్ చేసేందుకు కట్టు కధలతో వాస్తవంగా షర్మిల, సునీతను డామేజ్ చేస్తోంది. ఎవరు ఈ పోస్టింగ్స్ చేస్తున్నారో షర్మిల, సునీతకు పూర్తి స్పష్టత ఉంది. రాజకీయంగా చంద్రబాబు మెప్పు కోసం ఆ ఇద్దరు వాస్తవాలు పక్కన పెట్టి.. టీడీపీ సూచనల మేరకు విమర్శలు చేస్తున్నారు. కానీ, అసలు ఈ ప్రచారం వెనుక ఉన్నది టీడీపీ దొంగలేననేది పోలీసులు ఆధారాలతో సహా తేల్చే పనిలో పడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -