- Advertisement -

గెట్ రెడీ..టీడీపీ కళ్లు చెదిరేలా!

- Advertisement -

ఏపీ సీఎం జగన్ వ్యూహాలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వైనాట్ 175 లక్ష్యంగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు జగన్. ఇప్పటికే ప్రభుత్వ పథకాలు, పార్టీ విధానాలపై కేడర్‌కు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్న ముందుకు సాగుతున్నారు. ఇక మరోవైపు పెద్ద సిట్టింగ్‌లను మారుస్తున్నారు.

ఇక సిట్టింగ్‌ల మార్పు చేపట్టినా పెద్దగా అసంతృప్తి లేకుండా జాగ్రత్త పడుతుండగా మరో రెండు రోజుల్లో ప్రజలకు వరంలాంటి మేనిఫెస్టోను అనౌన్స్‌ చేయబోతున్నారు. 2019లో నవరత్నాలతో అధికారంలోకి వచ్చిన జగన్..ప్రతీ పథకాన్ని పేద ప్రజల చెంతకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. అదే ఇప్పుడు జగన్‌ని అధికారంలోకి తీసుకురావడానికి దోహదం చేస్తోంది.

ఇక ఈ నెల 18న వైసీపీ తాజా మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు జగన్. ఏపీ దిశా దశను మార్చే విధంగా జగన్ మేనిఫెస్టో ఉండనుంది. దీంతో జగన్ అనంతపురం వేదికగా విడుదల చేయనున్న మేనిఫెస్టో గురించి అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ది ప్రధాన ఎజెండాగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నవరత్నాలతో టీడీపీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు జగన్. 2019లో వచ్చిన మేనిఫెస్టోతో 151 స్థానాల్లో గెలుపొందగా ఇప్పుడు అంతకుమించి మేనిఫెస్టో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా వైసీపీ మేనిఫెస్టోపై టీడీపీ నేతలే కాదు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ప్రజల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -