Friday, May 3, 2024
- Advertisement -

టీడీపీ -జనసేన సీట్ల సంఖ్య ఫైనల్‌?

- Advertisement -

ఏపీలో టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా రెండు పార్టీలు పోటీ చేసే సీట్లపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు 30 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి పొత్తులో భాగంగా 40కి పైగా స్ధానాలను ఆశీంచింది జనసేన. కానీ టీడీపీ మాత్రం జనసేనకు 30 స్థానాలు కేటాయించినట్లు సమాచారం.

ఇక టీడీపీ 145 అసెంబ్లీ స్థానాలతో పాటు 23 లోక్ సభ స్థానాలకు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే వాస్తవానికి జనసేనకు 25 సీట్లు ఇవ్వాలని టీడీపీ నేతలు భావించారట. అంటే ప్రతీ పార్లమెంట్ పరిధిలో ఒక్కో అసెంబ్లీ సీటు ఇచ్చేలా ప్లాన్ చేసింది. కానీ పలు దఫాల చర్చల అనంతరం ఫైనల్‌గా 30 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు అంగీకారం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం.

టీడీపీ – జనసేన సీట్ల సంఖ్యపై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. జనసేనకు ఇచ్చే స్థానాలు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ,కృష్ణ,గుంటూరు,ప్రకాశం,కర్నూల్ జిల్లాల నుండే ఎక్కువ సీట్లు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ భీమవరం నుండి పోటీచేయడం దాదాపు ఖరారు కాగా రెండో స్థానం మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. తిరుపతి లేదా శ్రీకాకుళం రెండు అసెంబ్లీ స్థానాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -