- Advertisement -

బీజేపీలోకి రేవంత్ రెడ్డి!

- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇప్పటికే అంతర్గతంగా బీజేపీలో చేరిపోయాడు. ఎన్డీఏకు, రేవంత్ రెడ్డికి మధ్య చంద్రబాబు నాయుడు వారధిలా వ్యవహరిస్తున్నారు అన్నారు.

నాదెండ్ల భాస్కరరావు అంశంపై రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. ఆనాడు నాదెండ్ల భాస్కరరావుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుగా నిలిచింది అన్నారు. ఎన్టీఆర్ హయాంలో నాదెండ్ల భాస్కరరావును మంత్రి పదవి నుండి తొలగించినప్పుడు, ఆయనకు మద్దతుగా నేనే స్వచ్ఛందంగా నా మంత్రి పదవికి రాజీనామా చేశాను. నన్నెవరూ తొలగించలేదు, నేనే తప్పుకున్నాను అన్నారు.

కేవలం నేను మాత్రమే కాదు, ఆ రోజున ఇందిరా గాంధీ గారు, మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా నాదెండ్ల భాస్కరరావు వెంటే నిలిచింది. ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలియదు అనుకుంటానన్నారు.

రేవంత్ రెడ్డి ఆంధ్రా నాయకులకు తొత్తుగా, వారి చేతిలో కీలుబొమ్మలా మారాడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన సహకరిస్తున్నాడు అన్నారు. 2015లో టీడీపీలో ఉన్నప్పుడు వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయాలని చూసి, ‘ఓటుకు నోటు’ కేసులో దొరికిపోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి…. రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాడంటే అది కేసీఆర్ పెట్టిన భిక్ష (పుణ్యమే). అలాంటి కేసీఆర్‌ను పట్టుకొని ఉరితీస్తానంటావా?” అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -