Monday, May 13, 2024
- Advertisement -

నాలుగైదు నియోజకవర్గాల్లో కారు జోరుకు బ్రేకులు

- Advertisement -

కొండా సురేఖ, మురళీ దంపతులు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ తో భేటీ అనంతరం కొండా దంపతులు హస్తం గూటిలో వాలిపోయారు. టీఆర్ఎస్ లో తమకు టికెట్లు రాకుండా కేటీఆర్ అడ్డుకున్నారని, దారుణంగా అవమానించారని కొండా సురేఖ ఇప్పటికే తీవ్ర విమర్శలు చేశారు. తమకు ఎందుకు టికెట్ నిరాకరించారో చెప్పాలని, ప్రతి పనిలో కమీషన్లు తీసుకునే కేటీఆర్ వల్లే తమకు టికెట్లు రాలేదని మండిపడ్డారు. సీఎం అవ్వవచ్చని కలలు కంటున్న కేటీఆర్ ఆటలు సాగనివ్వబోమని సురేఖ్ సవాల్ విసిరారు. ఇక రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఘాటైన పదజాలంతో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆమె ఏ పార్టీలో చేరతారు అనే చర్చలు జోరుగా సాగాయి. గతంలో వైఎస్ఆర్ సీపీలో చేరిన ఆమె కేసీఆర్ కోటరితో నాడు చాలా గట్టిగా ఫైట్ చేశారు. నువ్వా నేనా అన్నట్టు ఆమె పోరాడారు. కాని అంత చేసినా తర్వాత రోజుల్లో తెలంగాణలో వైఎస్ఆర్ సీపీ మనుగడలో లేకపోవడంతో ఆమె తన రాజకీయ భవిష్యత్ ను టీఆర్ఎస్ లో చూసుకున్నారు. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అవ్వగలిగారు కానీ, మంత్రి పదవి ఆశించినా దక్కలేదు. పైగా ప్రతి అంశంలో ఆమె మాట నెగ్గకుండా పనులు పూర్తి కాకుండా హరీశ్ రావు వర్గం అనే సాకుతో కేటీఆర్ అడ్డుపడుతూ వచ్చారని సురేఖ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆమె కారు దిగి హస్తం గూటికి వెళ్లిపోయారు.

అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి సురేఖ ఫ్యామిలికీ ఒక్క టికెట్ హామీ వచ్చినట్లు తెలిసింది. మహాకూటమి పొత్తుల్లో భాగంగా అంతకంటే ఎక్కువ ఆశించవద్దని పార్టీ అధిష్ఠానం చెప్పినట్లు సమాచారం. అధికారంలోకి వస్తే కీలక పదవులు ఇస్తామని హామీ ఇవ్వడంతో సురేఖ దంపతులు అందుకు అంగీకరించి పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే మున్నూరుకాపు వర్గంలో కొండా సురేఖ దంపతులకు మంచి పట్టు వుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనీసం నాలుగైదు నియోజకవర్లాల్లో వీళ్లు గెలుపుని ప్రభావితం చేయగలరు. నిత్యం జనం మధ్యలో ఉంటూ వారి మనసులు గెల్చుకున్నారు అనే పేరు ఉంది. ఈ నేపథ్యంలో మహాకూటమిలో భాగంగా టీడీపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి నర్పంపేట్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన గెలుపునకు సహకరించాలని కాంగ్రెస్ పెద్దలు సురేఖకు సూచించడంతో ఆమె అంగీకరించారు. తమ పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ఒకవేళ ఆయనకు పరకాల టికెట్ ఇచ్చినా గెలుపునకు కృషి చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో సురేఖకు వరంగల్ ఈస్ట్ కేటాయించనున్నారు. సో ఆ రెండు నియోజకవర్గాలతో పాటు మరో రెండు, మూడు నియోజకవర్గాల్లో సామాజిక వర్గం పరంగా మంచి పట్టువున్న కొండా దంపతులు అక్కడ కచ్చితంగా ఆధిపత్యం సాధించే అవకాశాలు ఎక్కువున్నాయి. అంగబలం ఆర్ధబలం పుష్కలంగా ఉండటంతో మహాకూటమి తరఫున వీళ్లు ఈ సారి సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -