Monday, May 13, 2024
- Advertisement -

జనసేన ఎఫెక్ట్‌…బీజేపీకి ‘కొండా’ షాక్!

- Advertisement -

తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీని వీడేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్‌తో పాటు కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన నేతలంతా తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. తాజాగా కొండా కూడా చేరుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక కొండ బీజేపీని వీడటానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ జనసేన. తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా జనసేనకు 9 స్థానాలు కేటాయించనుండగా ఇందులో ప్రధానంగా సెటిలర్ ఓట్లు ఉన్న నియోజకవర్గాలే ఉన్నాయి. ఇప్పటికే జనసేనకు కూకట్ పల్లి, శేర్‌లింగంపల్లి స్థానాలు కేటాయించడంపై స్ధానిక బీజేపీ నేతలు ఫైర్ అవుతుండగా తాండూర్ నియోజకవర్గాన్ని జనసేనకు ఇస్తారని టాక్ నడుస్తున్న నేపథ్యంలో కొండా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఇదే విషయాన్ని బీజేపీ నేతలకు తేల్చి చెప్పారు కొండా. అయితే వారు కొండాను లైట్ తీసుకుని తాండూరుని జనసేనకే ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇదే జరిగితే పార్టీని కొండా వీడటం ఖాయమని ఆయన అనుచరులు చెబుతున్న పరిస్థితి నెలకొంది.

కొండా ముందున్న ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే. అంతకుముందు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో విభేదాల కారణంగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత బీజేపీలో చేరగా ఇప్పుడు తిరిగి హస్తం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే రేవంత్, డీకేతో కొండా చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఎన్నికల వేళ బీజేపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -