Saturday, May 4, 2024
- Advertisement -

బీఆర్ఎస్ మేనిఫెస్టో..విపక్షాలకు మైండ్ బ్లాంకేనా?

- Advertisement -

తెలంగాణ ఎన్నికల సమరంలో మేనిఫెస్టో వార్ మొదలైంది. ఇక ఈ వార్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా సోనియా 6 గ్యారెంటీలను అనౌన్స్‌ చేయగా తాజాగా మరో గ్యారెంటీని తీసుకొచ్చింది కాంగ్రెస్. ఇక బీజేపీ సైతం ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను సిద్ధం చేస్తుండగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఎలాం ఉండనుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ తరుణంలో కొడంగల్ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో అక్టోబర్ 16న జరిగే బహిరంగసభలో బీఆర్ఎస్ మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ విడుదల చేయనున్నారని చెప్పారు. ఈ మేనిఫెస్టోతో విపక్షాల మైండ్ బ్లాంక్ కావడం ఖాయమని తెలిపారు. అయితే హరీష్ మాటలను బట్టి చూస్తుంటే మహిళలకు పెద్దపీట ఉండనుందని తెలుస్తోంది. ఎందుకంటే స్వయంగా హరీషే..మహిళలు శుభవార్త వింటారని దానికోసం వేచిచూడాలని చెప్పారు.

ఇక కాంగ్రెస్ మహిళలకు పెద్దపీట వేస్తూ మేనిఫెస్టో ప్రకటించింది. గృహిణీలకు నెల నెల పెన్షన్, ఉచిత బస్సు ప్రయాణాన్ని అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రకటించబోయే ఆ శుభవార్త ఏంటా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇక రైతు బంధు నిధుల పెంపు, పెన్షన్ పెంపుపై ప్రకటన చేస్తారని విశ్వసనీయవర్గాల సమాచారం.

ఇక ఇప్పటికే ప్రకటించిన పలు హామీలతో విపక్షాలు అతలాకుతలమయ్యాయి. ఆర్టీసీని ప్రభుత్వ పరం చేయడం,అంగన్‌వాడీల నుండి పలు రంగాల్లో సేవలందిస్తున్న వారి జీతాల పెంపు,ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ,ఉద్యోగుల డీఏపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక అక్టోబర్ 6న ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని ప్రారంభించనున్నారు కేసీఆర్. దీనికి తోడు ఎన్నికల మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు ఇవ్వ‌నున్నార‌నే ఆస‌క్తి అందరిలో నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -