Saturday, May 4, 2024
- Advertisement -

పవన్‌ జనసేనకు షాకే..ఏపీలో పరిస్థితి ఏంటో?

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు గట్టి పరాభవం ఎదురైంది. పోటీ చేసిన 8 స్థానాల్లో డిపాజిట్ కొల్పోయింది. కొన్ని స్థానాల్లో కనీసం రెండు వేల ఓట్లు కూడా రాని పరిస్థితి నెలకొంది. అయితే జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తే అదే నెంబర్ 8 స్థానాల్లో బీజేపీ గెలిచింది.

కూకట్ పల్లి, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వరావుపేట ఇలా పోటీ చేసిన ఎక్కడా కూడా ప్రభావం చూపలేకపోయింది. వాస్తవానికి తొలుత 32 స్థానాల్లో పోటీచేయాలని భావించారు పవన్. ఇందుకు సంబంధించి స్థానాలను కూడా ప్రకటించారు. అయితే అనూహ్యంగా బీజేపీతో పొత్తు కుదరడంతో కేవలం 8 స్థానాల్లో పోటీకి పరిమితం అయింది.

ఓ దశలో పవన్ ప్రచారం చేస్తారా అన్న సందేహం నెలకొనగా సరిగ్గా ప్రచారం ముగిసే నాలుగు రోజుల ముందు రంగంలోకి దిగారు పవన్. అయితే ఎక్కడా కూడా బీఆర్ఎస్‌పై విమర్శలు చేయలేదు. ఇక పవన్ ప్రసంగాలు చప్పగా సాగగా జనసేన నేతలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. అయితే బీజేపీ – జనసేన కలిసి పోటీ చేస్తుండటంతో మంచి ఫలితాలు సాధిస్తామని భావించినా పవన్ అంచనాలు తలకిందులయ్యాయి. బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం కాగా జనసేన ఒక్క స్థానం లో కూడా సత్తా చాటలేక చేతులెత్తేసింది. ఇప్పుడు తెలంగాణ ఫలితాల ఎఫెక్ట్ ఖచ్చితంగా ఏపీపై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి పవన్ తెలంగాణలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు వద్దని వారించారు సీనియర్ నేతలు. అయితే పవన్‌ వినిపించుకోలేదు….ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకున్న పరిస్థితి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -