Tuesday, May 14, 2024
- Advertisement -

రేవంత్‌తో కాంగ్రెస్‌కు మైనసేనా?

- Advertisement -

తెలంగాణ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు నెలకొంది. ఈ రెండు పార్టీల్లో చేరికలతో జోష్ నెలకొనగా ప్రధానంగా సీఎం కేసీఆర్ తన ప్రచారంలో ఉత్తమ్ కుమార్, రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నారు. అటు రేవంత్ సైతం సీఎం కేసీఆర్, ఆయన కుటుంబమే టార్గెట్‌గా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలో పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్న రేవంత్…ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ప్రధానంగా కరెంట్, రైతు సమస్యలపై ఆయన చేసిన వ్యాఖ్యలను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ వస్తే మూడు గంటల కరెంట్ మాత్రమే వస్తుందని అంతా ఆలోచించాలని సూచిస్తున్నారు.

తాజాగా టీడీపీ పార్టీపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు ప్లస్ అవుతాయో లేక మైనస్ అవుతాయో అన్న చర్చ ఇప్పుడు మొదలైంది.తనకు టీడీపీ పుట్టినిల్లని.. కాంగ్రెస్ అత్తారిల్లని అర్థం వచ్చేలా కామెంట్స్ చేశారు. రేవంత్ టీడీపీలో నుండి కాంగ్రెస్‌లోకి రాగా టీడీపీలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో జైలు శిక్ష కూడా అనుభవించారు. ఇక రేవంత్ కాంగ్రెస్‌లో చేరిన ఆయనపై టీడీపీ నేత అనే ముద్ర ఇప్పటికి ఉంది.

దీనికి మరింత బలం చేకూర్చేలా నేను టీడీపీ నుంచి బయటకు వచ్చాను…కూతురు పుట్టింట్లో తల్లిదండ్రుల పక్షాన ఉంటుంది. అత్తగారింటికి వెళ్ళాక ఆ ఇంటి గౌరవాన్ని కాపాడుతుంది. కాంగ్రెస్ లో కొడలిగా నా పాత్ర పోషించాలని మాట్లాడారు. దీంతో రేవంత్‌పై సోషల్ మీడియాలో సెటైర్లతో రచ్చరచ్చ చేస్తున్నారు. మరి రేవంత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు ఎలా ఖండిస్తాయో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -