- Advertisement -

సాధారణ ట్రాఫిక్ లోనే సీఎం రేవంత్ కాన్వాయ్

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిరాడంబరతను మరోసారి చాటుకున్నారు. సాధారణ పౌరులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముఖ్యమంత్రుల కాన్వాయ్ వెళ్లే సమయంలో గంటల తరబడి ట్రాఫిక్‌ను నిలిపివేసే ‘వీఐపీ సంస్కృతి’కి చెక్ పెడుతూ, ఆయన సాధారణ ట్రాఫిక్‌లోనే ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు.తన కాన్వాయ్ కోసం నగరంలో వాహనాలను నిలిపివేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పనులపై వెళ్లే వారు, ఆఫీసులకు వెళ్లే వారు ట్రాఫిక్ ఆంక్షల వల్ల ఇబ్బంది పడకూడదని ఆయన స్పష్టం చేశారు.

ఈరోజు శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు ప్రయాణించే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ సాధారణ ట్రాఫిక్‌లోనే పయనించింది. సీఎం ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు కఠినమైన ఆంక్షలు విధించకుండా, కేవలం సింగిల్ లైన్‌లో వాహనాలను అనుమతిస్తూ కాన్వాయ్‌ను పంపించారు.గతంలో సీఎం కాన్వాయ్ వస్తుందంటే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయేవి. కానీ నేడు అలాంటి దృశ్యాలు కనిపించలేదు.

కాన్వాయ్ వెళ్తున్న పక్కనే సామాన్యుల వాహనాలు కూడా వెళ్లడం విశేషం.సామాన్యుల ఇబ్బందులను గుర్తించి సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రజా ప్రభుత్వంలో ప్రజలే ముఖ్యమని, వారికి కష్టం కలగకుండా పాలన సాగాలని రేవంత్ రెడ్డి ఈ చర్య ద్వారా సందేశం పంపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి ఇలా సాధారణ ట్రాఫిక్‌లో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -