- Advertisement -

మూసీ ప్రాజెక్టుపై వెనక్కు తగ్గని రేవంత్ రెడ్డి

- Advertisement -

మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి వెనక్కు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఉగాది రోజున మూసీ పనులకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టుకు సంబంధించి బాధితుల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ అధికారులు పనులు కొనసాగిస్తున్నారు.

లంగర్ హౌస్ నుంచి నార్సింగి వెళ్లే మార్గంలో రాందేవ్ గూడ వద్ద జేసీబీలతో చెట్లను తొలగిస్తున్నారు. వాహనదారులు, స్థానికులకు కనిపించకుండా గ్రీన్ మ్యాట్‌ను అడ్డుగా పెట్టి పెద్ద పెద్ద వృక్షాలను నరికివేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ చర్యలపై పర్యావరణ ప్రేమికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మొదటి దశలో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర మూసీ సుందరీకరణ చేపట్టనున్నారు. ఇందుకు సుమారు రూ.5,000 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఇందులో రూ.4,100 కోట్లు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ADB) నుంచి సేకరించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గాంధీ సరోవర్ అభివృద్ధి కోసం కేంద్ర రక్షణ శాఖకు చెందిన 38.09 ఎకరాల భూమిని కూడా తెలంగాణ ప్రభుత్వం సేకరించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -