- Advertisement -

వనపర్తిలో హీరో సిద్ధార్థ్ -అదితి వివాహం

- Advertisement -

టాలీవుడ్ ప్రేమ జంట సిద్ధార్థ్‌ – అదితీరావు హైదరి ఒక్కటయ్యారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా వివాహం చేసుకున్నారు.మొదట డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని భావించినా చారిత్రాక వనపర్తి ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఈ ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది.

అదితి తల్లి ఒకప్పటి వనపర్తి జాగీర్ చివరి రాజా రామేశ్వర రావు కూతురు. అందుకే ఇక్కడే పెళ్లి చేసుకున్నారు. 2021 మహా సముద్రం సినిమా వీరిద్దరిని కలిపింది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడగా ఈ ఏడాది మార్చిలో వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగింది.

పెళ్లికి సంబంధించిన ఫోటోలనే షేర్ చేశారు సిద్ధార్థ్. నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. నువ్వే నా నక్షత్రాలన్నీ.. శాశ్వతమైన పిక్సీ సోల్‌మేట్స్ గా ఉండటానికి, నవ్వులకు, నిత్యనూతనమైన ప్రేమ, లైట్, మ్యాజిక్ మిసెస్ అండ్ మిస్టర్ ఆదు సిద్దూ అని వెల్లడించారు. సిద్ధార్థ్ కు మూడో పెళ్లి కాగా.. అదితికి రెండో పెళ్లి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -