- Advertisement -

ఆర్ఆర్ఆర్‌పై తెలంగాణ సీఎం

- Advertisement -

రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వికారాబాద్- కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం.

తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ ఉండాలని సూచించారు. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు.

రీజనల్ రింగ్ రైల్ ఆవశ్యకతను అధికారులకు వివరించారు. భవిష్యత్అవసరాలకు అనుగుణంగా కొత్త రైల్వేలైన్స్ ప్రతిపాదనలను పరిశీలించాలని…శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ కోసం కొత్తగా రైల్వే కనెక్టివిటీ అంశాన్నీ పరిశీలించాలన్నారు. ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్ తో పోలిస్తే కొత్త లైన్ తో దూరం కూడా తగ్గుతుందని సీఎం రేవంత్ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -