- Advertisement -

20 ఏళ్ల తర్వాత కలిసిన ఠాక్రే సోదరులు!

- Advertisement -

ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) వర్గం మరియు రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) జనవరి 15న జరగనున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలను కలిసి ఎదుర్కొననున్నాయి. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపిణీపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుందని నేతలు తెలిపారు.

ఉద్ధవ్ ఠాక్రేతో విభేదాల కారణంగా రాజ్ ఠాక్రే 20 సంవత్సరాల క్రితం శివసేనను వీడి ఎంఎన్‌ఎస్‌ను స్థాపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తొలిసారిగా ఈ ఇద్దరు సోదరులు బుధవారం బీఎంసీ ఎన్నికల కోసం కూటమిని ప్రకటించారు.

కుటుంబ సభ్యులతో కలిసి వేదికపైకి వచ్చిన ఠాక్రే సోదరులను చూసి శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఈ క్షణాన్ని “శుభారంభం”గా అభివర్ణించారు. బీఎంసీతో పాటు ఇతర మున్సిపల్ కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగురవేయాలంటే ఠాక్రే సోదరుల ఐక్యతే మార్గమని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, “ఎప్పటికీ ఐక్యంగా ఉండేందుకు మేము ఇప్పుడు కలిసాం. మరాఠీ మనుష్‌ను శక్తివంతం చేయడమే మా ప్రధాన లక్ష్యం” అన్నారు. ముంబైని నాశనం చేయాలని కొంతమంది శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అంతర్గత కలహాలు కొనసాగితే హుతాత్ములకు అవమానం అవుతుందని, ముంబై ఎప్పటికీ మరాఠీ మనుష్‌ నుంచీ దూరం కావదని స్పష్టం చేశారు.

తాము ఠాక్రే సోదరులుగా కలిసివచ్చామని ఉద్ధవ్ తెలిపారు. తమ తాత ప్రభోధంకర్ ఠాక్రే మహారాష్ట్ర కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. ముంబై మహారాష్ట్రలో భాగమైన తర్వాత బాలాసాహెబ్ ఠాక్రే శివసేనను స్థాపించారని, పార్టీకి 60 ఏళ్ల చరిత్ర ఉందని అన్నారు. రాజ్ ఠాక్రే కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఏ విభేదాలకన్నా పెద్దదని, అంతర్గత గొడవలతో రాష్ట్రాన్ని బలహీనపరచకూడదని అన్నారు. పిల్లల అపహరణలో పాల్గొనే గ్యాంగులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయని, అలాంటి గుంపులను రెండు పార్టీలే నడుపుతున్నాయంటూ విమర్శించారు.

ఈ క్షణాన్ని రాష్ట్రం చాలా కాలంగా ఎదురుచూస్తోందని పేర్కొన్న రాజ్ ఠాక్రే, శివసేన (యూబీటీ)–ఎంఎన్‌ఎస్ మధ్య కూటమి ఇప్పుడు అధికారికంగా ఏర్పడిందని ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -