Saturday, May 4, 2024
- Advertisement -

పొత్తులు అంటే ఓటమిని అంగీకరించినట్టేనా… ?

- Advertisement -

90వ దశకం నుంచి నేటివరకూ దాదాపు అన్ని ఎన్నికల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ బరిలో ఉన్న పార్టీలు సిద్ధాంతాలను పక్కనబెట్టి ఇతర పార్టీలతో సయోధ్య కుదుర్చుకోవడం అన్నది జరుగుతూ వచ్చింది. అసలు ఈ పొత్తులు ఏ కారణంగాతెరపైకి వచ్చాయి? తమ సిద్ధాంతాలను పణంగా పెట్టి మరీ ఆయా పార్టీ ఎందుకు చేతులు కలుపుతున్నాయి? అన్నది కీలకమైన అంశమే.

2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మౌనం వహిచిన జనసేన అదినేత పవన్ కల్యాణ్‌. కొన్ని రోజులుగా రాజకీయ ప్రణాళికల విషయంలో దూకుడు పెంచి రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిత్యం ఏదో ఒక రకంగా ప్రజల్లో ఉండేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతువచ్చారు జనసేనాని. కాని సడన్ గా పొత్తుల రాజకీయలకు తెరలేపారు. ఇప్పుడు పొత్తులతో అధికారం వస్తుందా… సర్వత్ర చర్చ జరుగుతుంది.

అసలు పొత్తులు ఏ ప్రాతిపదిక మీద జరుగుతాయి.. ఎందుకు పార్టీలు సిద్ధాంతాలను పక్కనబెట్టి పొత్తులుపెట్టుకుంటాయి.. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తమ తమ పార్టీలు ఇంటర్నల్ సర్వే చేయించుకుంటారు. ఈ సర్వేలు ప్రజల నాడి తెలుసుకుని.. తమ పై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందని తెలుసుకుని అధికారం కోసం పొత్తుల వైపు మొగ్గు చూపుతారు. అంటే తమ ఓటమిని అంగీకరించినట్టే. ఈ పొత్తులు కేవలం అధికారం కోసం మే తప్ప.. ప్రజలకు ఏదో చేయడానికి అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఒకప్పుడు నియమ నిబంధనలు, విలువలతో కూడిన రాజకీయ పొత్తులు ఉండేవి. ఇప్పుడు స్వర్థం, అధికారం కోసం రాజకీయ పొత్తులు ఎత్తులు ఉంటున్నాయి.

ఇప్పడు ఏపీ రాజకీయాల్లో పొత్తు రాజకీయాలు తెరపైకి వచ్చాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు పెటుకుని ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చ‌నివ్వ‌ను అంటున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ను తిరస్కరించిన ప్రజలు అంతగా వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉంటే.. ప్రత్యన్యాయం ఎత్తుకుంటారు. అంటే బీజేపీ కంటే జనసేనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాని ఇప్పుడు జనసేననే పొత్తు రాజకీయాలు తెరలేపింది అంటే జనసేన ఓటమిని అంగీకరించినట్టే.. మరోపక్క టీడీపీ కూడా పొత్తులకు సై అంటుందంటే టీడీపీ కూడా ఓటమిని అంగీకరించినట్టే.. టీడీపీ, జనసేన ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా లేక పొత్తు రాజకీయాలు తెరపైకి వచ్చాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Also Read: టీడీపీ ,జనసేన, బీజేపీ పొత్తు వల్ల వైసీపీకి నష్టమా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -