- Advertisement -

యూపీలో తుఫాన్ బీభత్సం..

- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లో తుఫాన్ బీభత్సం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, పిడుగులు మరియు ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రకృతి వైపరీత్యం ధాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 54 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.

ఈ తుఫాను ప్రభావం రాష్ట్రంలోని పలు జిల్లాలపై తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ దేహత్, ఫతేపూర్, భదోహీ మరియు బుదౌన్ జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.భదోహీ జిల్లాలో అత్యధికంగా ఈ జిల్లాలోనే 15 మంది మరణించినట్లు సమాచారం అందుతోంది.

ప్రయాగ్‌రాజ్, ఫతేపూర్ మరియు కాన్పూర్ ప్రాంతాల్లోనూ భారీగా ప్రాణ నష్టం సంభవించింది. పిడుగులు పడటం, చెట్లు విరిగి పడటం మరియు ఇళ్లు కూలడం వంటి ఘటనలే మరణాలకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.కేవలం ప్రాణ నష్టమే కాకుండా, భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది.ఈదురుగాలులు, వడగళ్ల వాన వల్ల వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు నీటిపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

వందలాది విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రవాణా వ్యవస్థకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది.ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం, మృతుల కుటుంబాలకు తక్షణమే పరిహారం అందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించింది.

రాబోయే మరో 24 గంటల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -