Saturday, May 4, 2024
- Advertisement -

రాధా చూపు వైసీపీ వైపు..ఎంపీగా కన్ఫామ్?

- Advertisement -

వంగవీటి రాధాకృష్ణ…విజయవాడ రాజకీయాల్లో సంచలనం. రంగా వారసుడిగా రాజకీయాల్లో రాణిస్తున్న రాధా వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాధా వైసీపీలోకి వస్తే కాపు సామాజిక వర్గం ఓట్లు వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. దీంతో రాధాను తిరిగి వైసీపీలోకి తెచ్చేందుకు నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

రాధా వైసీపీలోకి వస్తే ముద్రగడ ప్రభావాన్ని కొంతమేరకు తగ్గించ వచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏపీ రాజకీయాలన్ని ముద్రగడ చుట్టే తిరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన టీడీపీ లేదా జనసేనలో చేరుతారని ప్రచారం జరగుతోంది. ఈ నేపథ్యంలోనే రాధాను వైసీపీలోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇప్పటికే రాధాను వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు.

వాస్తవానికి 2019 ఎన్నికల ముందు రాధా వైసీపీని వీడి టీడీపీలో చేరినా తర్వాత యాక్టివ్‌గా లేరు. అందుకే రాధాను వైసీపీలోకి ఆహ్వానించి మచిలీపట్నం ఎంపీ సీటు ఇచ్చే ఆలోచనలో ఉన్నారట జగన్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండో లోక్ సభ స్థానంగా ఉన్న మచిలీపట్నం కాపు వర్గానికి ఇస్తే జిల్లా మొత్తం ప్రభావం ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుండి సిట్టింగ్ ఎంపీగా బాలశౌరి ఉండగా ఈ సీటును ఒకవేళ రాధా పార్టీలో చేరితో ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మచిలీపట్నం పరిధిలోనే గుడివాడ, గన్నవరం. పెనమలూరు వంటి నియోజకవర్గాలు ఉండటంతో రాధా పోటీ చేయటం ద్వారా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే రాధా వైసీపీలో చేరికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -