Monday, May 13, 2024
- Advertisement -

బీజేపీకి రాములమ్మ గుడ్ బై..కాంగ్రెస్ గూటికి!

- Advertisement -

తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి పంపించారు. కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు విజయశాంతి. ఇక ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ జాబితాలోనూ చోటు దక్కలేదు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదు. వాస్తవానికి అప్పటినుండే విజయశాంతి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. అయితే దానిని ఆమె ఎప్పుడూ ఖండించలేదు.

విజయశాంతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రకటించడం చర్చనీయాశంగా మారింది. రీసెంట్‌గా మోడీకి స్వాగతం పలికారు. దీంతో అంతా సర్దుకుందని భావించినా చివరకు రాజీనామాకే మొగ్గుచూపారు.

ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేయగా తాజాగా విజయశాంతి కూడా రాజీనామా చేయడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆమె రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనుండగా అనంతరం నుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.ఆమెకు మెదక్ ఎంపీ సీటుపై స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా ఒకప్పుడు చేరికలతో జోష్‌లో ఉన్న బీజేపీ ఇప్పుడు పూర్తిగా డీలా పడిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -