- Advertisement -

జనసేన నేతపై మహిళ ఆరోపణలు!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. జనసేన నేత జయ ప్రకాష్ నాయుడుపై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జడ్పీటీసీగా ఉన్న జయప్రకాశ్ నాయుడు తనను ఆర్థికంగా, శారీరకంగా ఉపయోగించుకుని మోసం చేశాడని బాధితురాలు ఆరోపించారు. నమ్మకంతో దగ్గరైన తర్వాత తనను దుర్వినియోగం చేసి ఇప్పుడు వదిలేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితురాలు కన్నీరు పెట్టుకుంటూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తోంది. ప్రజలు, నెటిజన్లు ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆరోపణలు బయటకు రావడంతో సంబంధిత అధికారులు, పోలీసుల దృష్టికి విషయం వెళ్లినట్లు సమాచారం. ఆరోపణలపై విచారణ చేపట్టే అవకాశముంది.

మొత్తానికి, ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలపై నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -