- Advertisement -

ఐపీఎల్ 2025..వేలానికి ఈసారి స్టార్ ప్లేయర్స్!

- Advertisement -

ఐపీఎల్ 2025కి సర్వం సిద్దమవుతోంది. ఈ సారి సీజన్‌లో ఐదుగురు స్టార్ ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. త్వరలో ఐపీఎల్ వేలానికి సంబంధించిన తేదీలను అనౌన్స్ చేయనుండగా వేలంపై అందరూ దృష్టి సారించారు.

ఇక ఈసారి ఐపీఎల్‌లో ఉన్న స్టార్ ప్లేయర్ల విషయానికొస్తే స్టివ్ స్మిత్, బెన్ స్టోక్స్, సర్ఫరాజ్ ఖాన్,తబ్రేజ్ షమ్సీ,టైమల్ మిల్స్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. గత ఐదు సీజన్‌లుగా ఐపీఎల్‌లో పాల్గొనలేదు స్టీవ్ స్మిత్. ఈసారి వేలంలో తన పేరు ఉండటంతో కన్ఫామ్‌గా ఎంట్రీ ఇస్తానని చెబుతున్నాడు.

అలాగే బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్‌. గాయం కారణంగా గత సీజన్‌ ఐపీఎల్‌లో పాల్గొనలేదు స్టోక్స్. అయితే ఈ సారి తన రీ ఎంట్రీ ఖాయమని చెబుతున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు తబ్రేజ్ షమ్సీ సైతం ఈసారి వేలంలో అందుబాటులోకి రానున్నాడు. చివరగా 2021లో ఐపీఎల్‌లో ఆడగా ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ఫామ్‌తో ఆకట్టుకున్నాడు.

ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ టైమల్ మీల్స్ చివరగా 2022లో ఐపీఎల్ ఆడాడు. ఆర్సీబీ, ముంబై జట్ల తరపున ప్రాతినిధ్యం వహించిన మీల్స్ గత రెండు సీజన్‌లలో ఆడలేదు. ఇక భారత ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌ది ఇదే పరిస్థితి. గత సీజన్ ఐపీఎల్ వేలంలో సర్ఫరాజ్ ఖాన్ అమ్ముడుపోలేదు. 2025లో తన ఎంట్రీపై ధీమాతో ఉన్నాడు సర్ఫరాజ్. వీరితో పాటు చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఈ సారి ఐపీఎల్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. మొత్తంగా ఐపీఎల్ వేలంలో ఏ జట్టు ఎవరిని దక్కించుకుంటుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -