- Advertisement -

చిన్న అర్జున్ కి తండ్రిగా పెద్ద అర్జున్

- Advertisement -
Arjun As Father To Allu Arjun

అల్లు అర్జున్ నటించిన సరైనోడు ఏ రెంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత బన్నీ అదే రెంజ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సారి బన్నీ హరిష్ శంకర్ దర్శకత్వంలో డీజే మూవీ లో నటిస్తున్నాడు. బారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి స్పందన వచ్చింది.

త్వరలో ఆడియోని కూడా నెట్లో రిలీజ్ చేయనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 23 న రిలీజ్ కానుంది. ఇది థియేటర్లోకి రాకముందే నెక్స్ట్ సినిమాని మొదలెట్టనున్నారు. రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ నటించనున్నారు. శిరీషా శ్రీధర్ లగడపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాకి బన్నీ వాసు కూడా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. కె నాగేంద్రబాబు సమర్పిస్తున్న ఈ చిత్రానికి  ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే పేరును చిత్ర బృందం పరిశీలిస్తోంది.

యంగ్ సోల్జర్ గా అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాలో తండ్రి పాత్రలో అర్జున్ నటిస్తున్నట్లు తెలిసింది. అర్జున్ కూడా గతంలో అనేక దేశభక్తి సినిమాలు చేశారు. ఇది కూడా ఆ జానర్ కావడంతో వక్కంతం వంశీ సీనియర్ నటుడు అర్జున్ ని కలవడం, నటించడానికి ఆయన ఒకే చెప్పడం జరిగిపోయాయని తెలిస్తోంది. ప్రస్తుతం నితిన్ లై మూవీలో నటిస్తున్న అర్జున్, ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ సినిమాలో నటించనున్నాడు. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. రష్మీతో రొమాన్స్ చేస్తున్న అల్లు అర్జున్
  2. పవన్ రికార్డుని పటాపంచలు చేసిన అల్లు అర్జున్
  3. అల్లు అర్జున్ కోసం పవన్.. ఆ పని చేస్తాడా..? ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
  4. రాజేంద్ర ప్రసాద్ ముసలి ఏజ్ లవ్ స్టోరీ .. అల్లూ అర్జున్ ప్రొడ్యూసర్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -