- Advertisement -

శృతిహాసన్‌ సర్జరీ చేయించుకుందా..?

- Advertisement -
bad rumor halchal on sruthi hasan in social media

సినీ పరిశ్రమలో.. టాలెంట్ తోపాటు అందం ఉన్న హీరోయిన్ శృతిహాసన్ ఒకరు. సినిమాలో హీరోయిన్ గా మాత్రమే కాకుండా.. గాయనిగా కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాంటి శృతిహాసన్ తాజాగా సర్జరీ చేసుకొన్నదనే విషయంపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయింది. పెదవులకు సర్జరీ చేపించుకొన్నట్టు తెలిపే ఫొటోలను కొందరు పోస్ట్ చేసి హంగామా చేశారు.

{loadmodule mod_custom,GA1} 

సోషల్ మీడియాలో ప్రచారంపై జరుగుతున్న విషయంపై శృతిహాసన్ గట్టిగా జవాబు ఇచ్చింది. ప్రస్తుతం శృతిహాసన్ హిందీలో బహెన్ హోగీ తేరి అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. నా ముఖం, నా దేహం, నా శరీరంకు సంబంధించిన వ్యవహారాలు ఇతరులకు ఏం పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సర్జరీ చేసుకొన్నారా లేదా అనే విషయంపై ఆమె సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. నా గురించి సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేసిన పట్టించుకోను. ఏదో ప్రచారం చేస్తుంటారు. వారు చేసే కామెంట్లపై దృష్టిపెట్టను. వారందరికి సమాధానం చెప్పనవసరం లేదు అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. మీడియాలో తనపై వచ్చే వార్తలపై ఇలా సూటిగా మాట్లాడటం శృతిహాసన్‌కు తొలిసారి కాదు.

{loadmodule mod_custom,GA2} 

గతంలో కూడా శృతిహాసన్ ఇలానే ధీటుగా సమాధానం చెప్పారు.బహెన్ హోగీ తెరీ చిత్రంలోని పాత్ర కోసం శృతిహాసన్ ఇటీవల బరువు పెరిగింది. శృతిహాసన్ బరువు పెరుగడానికి కారణాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో కొందరు అతిగా స్పందించారు. అలాంటి వార్తలపై కూడా శృతిహాసన్ స్పందించింది. పాత్ర కోసం అందంగా, బొద్దుగా కనిపించడం తప్పదని.. చెప్పింది. బరువు పెరుగుతాం, తగ్గుతాం.. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని జవాబు ఇచ్చింది. 

{youtube}7I_cN-L3udc{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. పెళ్లికి ముందే పిల్లల్ని కంటా.. అతనితో ఎఫైర్ నిజమే.. శృతి హాసన్
  2. పెళ్లి చేసుకున్న శృతిహాసన్‌.. ఎవరినో తెలుసా..?
  3. శృతిహాసన్ ఎవరితో డేటింగ్ చేస్తుందో తెలుసా?
  4. పవన్ సీక్రెట్ ని శృతి బయటకి చెప్పేసిందిట

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -