ఈ వేసవిలో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్‍కు రెడి అవుతున్నాయి. వరసగా ఓ మూడు భారీ బడ్జెట్ సినిమాలు వచ్చే నెల రిలీజ్ కానున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా మహేష్‌బాబు ‘బ్రహ్మోత్సవం’, అల్లు అర్జున్ ‘సరైనోడు’ విడుదలవుతున్నాయి. మొదటగా పవర్ స్టార్ సర్దార్ సినిమాతో రాబోతున్నాడు.
ఇప్పటేకే ఈ సినిమాపై భారీ గా అంచనాలు ఉన్నాయి. సో ఈ సినిమా ఖచ్చితంగా రికార్డులు సృష్టిస్తుందని పవన్ అభిమానులు అంటున్నారు. అలాగే మహేష్ బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని కూడా వచ్చే నెలలోనే రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ నటిస్తున్న సరైనోడు చిత్రంపై కూడా అభిమానులో భారీ క్రేజ్ ఉంది.
ఇటివలే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‍కు మంచి స్పందన వచ్చింది. ఈ మూడు సినిమాలు దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్ చిత్రాలట. బహుశా వీటి రిజల్ట్‌తో ఏప్రిల్‌లో టాలీవుడ్ బాద్‌షా ఎవరో తేలిపోతుందట. మరి ఏ సినిమా ఏ రెంజ్‍లో హిట్ అవుతుందో చూడాలి మరి.
