క్రేజీ దర్శకుడికి కాజల్ నో చెప్పిందా?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలోకి దర్శకుడు తేజ రూపొందించిన ‘లక్ష్మీకల్యాణం’ చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమైన కథానాయిక కాజల్ అగర్వాల్. ఆ తర్వాత ఈ అమ్మడికి వరుసగా టాప్ హీరోల సరసన నటించే అవకాశం రావడంతో ఒక్కసారే క్రేజ్ పెరిగిపోయింది. కాజల్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయినా ఇంకా అప్ కమింగ్ హీరోయిన్లకు పోటీగా నటిస్తుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోలతో ఈ అమ్మడు నటించిన చిత్రాలు వరుస హిట్స్ సాధించాయి. స్టార్ హీరోలతో మాత్రమే కాదు..ఆప్ కమింగ్ హీరోలతో కూడా నటించింది.

అటు తమిళంలో కూడా పలు సినిమాలు చేసి అక్కడ కూడా సక్సెస్ అయింది. ఇటీవలే వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పటికే కొన్ని కొత్త సినిమాలు కమిట్ అయినప్పటికీ, తాజాగా తేజ సినిమాను వదులుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి కాజల్ ని తెలుగు తెరకు పరిచయం చేసింది తేజ. ఆ మద్య రెండు సినిమాలు కూడా తెరకెక్కించాడు.

- Advertisement -

దర్శకుడు తేజ ‘అలివేలుమంగ వెంకట రమణ’ అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు.  ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ ని తీసుకున్నట్లు సమాచారం. అయితే, తాజాగా ఆమె వ్యక్తిగత కారణాల వల్ల ఈ ప్రాజక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆమె స్థానంలో కథానాయిక తాప్సిని తీసుకున్నట్టు సమాచారం.  కాకపోతే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...