రాజమౌళి, మహేశ్ మూవీపై లేటెస్ట్ అప్ డేట్

- Advertisement -

ఆర్ఆర్ఆర్ సెన్సేషనల్ హిట్ ను ప్రస్తుతం ఆస్వాధిస్తున్నారు దర్శకధీరుడు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లను పాన్ ఇండియా రేంజ్ లో ఎలివేట్ చేసి సక్సెస్ అందుకున్నారు జక్కన్న. ఇక రాజమౌళి తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కావడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది తొలి మూవీ కావడం విశేషం. దాంతో ఈ సినిమా ఎలా ఉండబోతోందన్న సస్పెన్స్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఆప్రికన్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ స్టోరీని మహేశ్ బాబు కోసం సిద్ధం చేసినట్లు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలోనే ప్రకటించారు.

ప్రస్తుతం స్క్రిప్ట్ పనిలో విజయేంద్ర బిజీగా ఉన్నట్లు సమాచారం. తాజాగా మహేశ్ బాబు, రాజమౌళి మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ దసరాకు గ్రాండ్ గా లాంఛ్ చేయబోతున్నట్లు సమాచారం. అప్పటికల్లా స్క్రిప్ట్ పని పూర్త చేయబోతున్నారట. రాజమౌళి ఏ సినిమా తీసినా ఎక్కువ టైం తీసుకుంటారని తెలిసిందే.

- Advertisement -

ఈ చిత్రానికి కూడా ఎక్కువ రోజులే వెచ్చిస్తారని టాక్. మహేశ్ బాబు సైతం జక్కన్నకు బల్క్ డేట్స్ ఇచ్చారట. అయితే ఆ లోపు త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేశ్ తన 28వ చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. హాలీవుడ్ సిరీస్ ఇండియానా జోన్స్ తరహాలోని అడ్వంచరస్ మూవీగా ఉండబోతోందట.

పుష్ప 2లో బాలీవుడ్ సీనియర్ హీరో

ఆచార్య సినిమా నుంచి కాజల్ తొలగింపు.. ఎందుకంటే..?

పవన్ కల్యాణ్ తనయుడి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -