సూప‌ర్ స్టార్ మ‌హేశ్ నెక్స్ట్ మూవీ ఆయ‌న‌తోనేనా !

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుకు తెలుగు నాట‌నే కాకుండా దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో పాల‌పులారిటీ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు అనుకుంటా ! మ‌రీ ముఖ్యంగా ఈ వెండితెర ప్రిన్స్ అంటే యుత్‌లో య‌మ క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు. పరుశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

స‌ర్కారు వారి పాట సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా.. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ ఈ సినిమా త‌ర్వాత చేయ‌బోయే సినిమా‌పై ఇప్పుడే దృష్టి సారించ‌డాని తెలుస్తోంది. దీని త‌ర్వాత ఏ డైరెక్ట‌ర్‌తో సినిమా చేస్తార‌ని తెగ చ‌ర్చ న‌డుస్తోంది. అయితే, మాట‌ల మాంత్రికుడు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో మ‌హేశ్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని ఫిల్మ్ నగర్ లో టాక్ న‌డుస్తోంది.

- Advertisement -

ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఈ సినిమా స్టోరీని మహేశ్ బాబుకు వినిపించ‌గా.. ప్రిన్స్ ఒకే చెప్ప‌డ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని తెలుస్తోంది. కాగా, ఇప్ప‌టికే మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంభినేష‌న్‌లో రెండు సినిమాలు వ‌చ్చి రికార్డు సృష్టించాయి. ఈ సినిమా త‌ర్వాతే ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తో సినిమా చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

‘వకీల్ సాబ్’ హీరోయిన్ కు కరోనా

ఢిల్లీని వీడుతున్న ప్ర‌జ‌లు.. ఎందుకంటే..?

పవర్ స్టార్ కొత్త సినిమా పేరు ఇదే !

రెండు డోసులు తీసుకున్న 40 డాక్ట‌ర్ల‌కు క‌రోనా

మారుతి డైరెక్ష‌న్‌లో రవితేజ మూవీ !

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -