- Advertisement -

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో ప్రభాస్!

- Advertisement -

ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ది రాజసాబ్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రాగా తాజాగా ఇదే బ్యానర్‌లో మరో సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ను స్వయంగా కలసి మరో ప్రాజెక్ట్‌కు హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఫలితాలకంటే సంబంధాలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిగా ప్రభాస్ మరోసారి నిరూపించుకున్నారని సినీ వర్గాలు అంటున్నాయి.

త్వరలోనే ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈసారి కథ, ప్రణాళిక, నిర్మాణ విలువలు అన్నీ ప్రభాస్ స్థాయికి తగినట్టుగా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం అందరి చూపు అధికారిక ప్రకటనపైనే ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -