ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ మాస్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ లేదా బ్రూస్ లీ అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.
హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్రబృందం జోర్డాన్‌కు వెళ్లింది. కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్‌ను ముందుగానే ముగించాలని టీమ్ భావించిందని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా జోర్డాన్ షెడ్యూల్ పూర్తయినట్లు స్పష్టమైంది. ఇవాళ ఉదయం హైదరాబాద్ విమానాశ్రయంలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించారు. జోర్డాన్ నుంచి తిరిగివచ్చిన ఆయన సాధారణ దుస్తుల్లో, మాస్క్ ధరించి కనిపించారు.
న్టీఆర్ మళ్లీ ఎప్పుడు షూటింగ్‌లో పాల్గొంటారన్నది కూడా తెలియరాలేదు. ఈ చిత్రంలో కీలక పాత్రలో అనిల్ కపూర్ నటిస్తుండగా ఈ పాన్-ఇండియన్ యాక్షన్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
