స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్‌పై సంచలన కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బాలీవుడ్‌కు దూరమవ్వడానికి గల కారణాలను ఓపెన్‌గా వెల్లడించింది. తాను ఉద్దేశపూర్వకంగా బాలీవుడ్‌ను వదిలేయలేదు. అక్కడ వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ, ఒక దశకు వచ్చిన తర్వాత నా కెరీర్ ఒకే స్థాయిలో నిలిచిపోయినట్టు అనిపించింది. నా పరిధిని, మార్కెట్‌ను మరింత విస్తరించుకోవాలని భావించాను. కానీ ఆ అవకాశాలు కనిపించలేదు అని చెప్పింది.
అదే సమయంలో కొంత ఒత్తిడి కూడా ఎదురైంది. కొత్త సవాళ్లు స్వీకరించాలనే ఆలోచన నాలో బలపడింది. అందుకే హాలీవుడ్ వైపు అడుగులు వేసాను. అక్కడ అవకాశాలు రావడంతో పూర్తిగా అక్కడికే మారాను. ఇది నా కెరీర్‌లో కీలక మలుపు అని వెల్లడించింది.
అయితే ఇండియన్ సినిమాలపై తనకు ఉన్న మక్కువ ఎప్పటికీ తగ్గదని స్పష్టం చేసింది. భారతీయ సినిమాల్లో నటించడం నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. అందుకే ఇప్పుడు ‘వారణాసి’ అనే చిత్రంలో నటిస్తున్నాను అని తెలిపింది.
తమిళ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ప్రియాంక, ఆ తర్వాత బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి, అనంతరం హాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
