ప్రభాస్ ను ఢీ కొట్టనున్న పృథ్వీరాజ్..

- Advertisement -

నాలుగు సినిమాల షూటింగ్ లతో బిజి బిజిగా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేజీఎఫ్​ దర్శకుడు ప్రశాంత్​నీల్ తో భారీ బడ్జెట్​ సినిమా ’సలార్’​ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సలార్​ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడట. ఇందులో శృతి హాసన్​ హీరోయిన్​గా చేస్తోంది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం సలార్​ సినిమాలో ప్రభాస్ కు విలన్ గా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారని వార్త వైరల్ అవుతుంది. పృథ్వీరాజ్ విలనిజం సలార్ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది లో సలార్ రిలీజ్ కానుంది. స్పెషల్ సాంగ్ లో శ్రద్ధా కపూర్ నటిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరో వైపున ప్రభాస్ ఓం రౌత్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ మూవీలో ప్రభాస్​ రాముడిగా నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపద్యంలో.. ప్రాజెక్ట్ కే ( వర్కింగ్ టైటిల్) సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ 25వ సినిమా సందీప్ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే టైటిల్ ను సెట్ చేశారు.

రాత్రి త్వరగా భోజనం చేయటం లేదా? అయితే ఇది చదవండి!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -