Friday, April 19, 2024
- Advertisement -

బాహుబలి పార్ట్ 2 లో రాజమౌళికి కొత్త సమస్య

- Advertisement -

రాజమౌళికే అనే కాదు ఎంటైర్ కొండూరి ఫ్యామిలీకి కీరవాణి పెద్ద దిక్కు.అతనిచ్చిన సపోర్ట్ తోనే అందరూ సేవ్ అవుతూ వచ్చారు.

ఈవిషయాన్ని స్వయంగా జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

అందుకే రాజమౌళి నేడు ఈ పొజిషన్ లో ఉన్నా…. కీరవాణి లేకుండా అస్సలు సినిమానే చేయడు. అంతేనా…. రాజమౌళి చేసిన సినిమాలకు ఫైనల్ ఎడిటింగ్ లో  కీరవాణి ఇచ్చే సలహాలే  ఫైనల్ జడ్జిమెంట్.

కాని ఇపుడున్న టైమ్లో బాహుబలి పార్ట్ 2 కు కీరవాణి పూర్తి స్థాయిలో పని చేయలేకపోవచ్చు. ఎందుకంటే కీరవాణి  2016 మే నెలలో  రిటైర్ అయిపోతున్నాడు. ఇది స్వయంగా ఆయన చెప్పిన మాటే.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బాహుబలి 2 షూటింగ్ ఇంకా లేటయ్యేటట్లుగా ఉంది.

దానికి తోడు బడ్జెట్ కూడా భాగా పెరిగిపోవడంతో సినిమా కొంతమేర రీ షూట్ ,కొత్త ఆర్టిస్ట్ లను సెలెక్ట్ చేసుకోవల్సి ఉంది.ఇవన్ని జరిగి సినిమా పూర్తయ్యే సరికి… 2016 మే నెల దాటి పోవచ్చు. అలాంటి సందర్బంలో కీరవాణి ఈపాటికే ఆడియో ఇచ్చేసి ఉండవచ్చు గాని …ఆ తరువాత చేయబోయె బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు తాను అందుబాటులో ఉండడు.

మరి అలాంటి సందర్బంలో రాజమౌళికి వచ్చే చిక్కులు అన్నీ ఇన్నీ కావు. ఒక వేల అదే జరిగితే జక్కన్న కొండూరి కళ్యాణ్, రెహమాన్ లలో ఎవరిని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు తీసుకుంటాడనేది పెద్ద ప్రశ్నే. ఒక వేల కీరవాణి తన మనసు మార్చుకుని …సినిమా పూర్తయ్యే వరకు పని చేస్తే వెల్ అండ్ గుడ్ .లేదంటే రాజమౌళికి ఇబ్బందులు తప్పవు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -